రాజధాని
అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్ పై సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వానికి
ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఆర్ -5 జోన్ పై
విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం, హైకోర్టు తీర్పు పై స్టే ఇచ్చేందుకు
నిరాకరించింది. అలాగే ప్రతివాదులకు
నోటీసులు జారీ చేసింది. రిజాయిండర్స్ దాఖలు చేసేందుకు మూడు వారాల గడువు ఇస్తూ
తదుపరి విచారణను నవంబర్‌కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
సీఆర్డీఏ
నిబంధనలకు విరుద్ధంగా ఆర్-5 జోన్ లో ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం చేస్తోందని గతంలో
పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఇళ్ళ
నిర్మాణాలను నిలిపివేయాలంటూ తీర్పు చెప్పింది.
హైకోర్టు
తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేంద్రప్రభుత్వం
మంజూరు చేసిన ఇళ్ళ నిర్మాణం కోసమే ఆర్-5 జోన్ లో ప్రాజెక్టు మొదలు పెట్టామని
ధర్మాసనానికి ప్రభుత్వం తరఫు అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ తెలిపారు. స్టే ఇచ్చేందుకు
నిరాకరించిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ కు వాయిదా వేసింది.
అమరావతి
రాజధాని కేసు సుప్రీంకోర్టులో తేలే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట వద్దంటూ
రైతులు వేసిన కేసులో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. స్థానికేతరులకు
ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని హైకోర్టు
తప్పుపట్టింది. అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు
ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనిపై వాదనలు జరుగుతున్నాయి. ఆ కేసు
తేలకుండానే అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడితే, భవిష్యత్తులో
ఇళ్ల నిర్మాణాలకు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వందల కోట్ల ప్రజాధనం వృధా
అవుతుందని కేసు విచారణ సందర్శంగా హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన సంగతి
తెలిసిందే.
సుప్రీంకోర్టులో అమరావతి రైతులు వేసిన కేసు తేలేవరకు స్టే విధిస్తూ ఏపీ
హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును
ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు
నిరాకరించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు