వాణిజ్య
వంటగ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. 19
కిలోగ్రాముల సిలిండర్ ధరపై రూ. 158 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఎల్పీజీ
సిలిండర్ పై ఇండియన్ ఆయిల్ కంపెనీ రూ. 158 తగ్గించడంతో ప్రస్తుత ధర దిల్లీలో రూ.
1,522.50 గా ఉంది.
వాణిజ్య,
గృహోపకరణ సిలిండర్ ధరలపై చమురు కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెల ఆరంభంలో సమీక్షలు
నిర్వహిస్తాయి. ప్రస్తుత తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తోందని పేర్కొన్నాయి.
ఆగస్టులో
ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.99.75 తగ్గించారు. జులైలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్
సిలిండర్ ధర ఏడు రూపాయలు పెరిగింది.
ఈ
పెరుగుదలకు ముందు మే, జూన్ లో వరుసగా రెండు సార్లు తగ్గించారు. చమురు సంస్థలు ఎల్పీజీ
సిలిండర్ ధరను మే లో రూ. 172 రూపాయలు తగ్గించగా, జూన్ లో మరో 83 రూపాయలు మేర
తగ్గించింది. ఏప్రిల్ లో యూనిట్ కు రూ.91.50 తగ్గించింది.
వంట
గ్యాస్ ధరలు గత కొన్నేళ్ళుగా పెరుగుతుండటం పాలకపార్టీలకు ప్రతికూలంగా మారింది.
ఎన్నికల వేళ ప్రధాన అస్త్రంగా నిలిచింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గత
పాలకపార్టీపై వంటగ్యాస్ ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సిలిండర్ ధరపై
కాంగ్రెస్ పార్టీ రాయితీలు ప్రకటించి అధికారం కైవసం చేసుకుంది.
కాంగ్రెస్
మేనిఫెస్టో లో వంటగ్యాస్ ధర తగ్గింపు హామీకి ప్రత్యేక స్థానం కేటాయించారు. దీంతో
పాలక బీజేపీ కూడా అప్రమత్తమైంది. కాంగ్రెస్ కు
కౌంటర్ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం, సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం
తీసుకుంది. ఎల్సీజీ, తదితర ఇంధనాలపై
విదించే సుంకాన్ని తగ్గించింది.
గృహోపయోగ
వంటగ్యాస్‌పై కేంద్రప్రభుత్వం ఆగస్టు 29న ఒకేసారి రూ.200
తగ్గించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం
తీసుకున్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ ధర ఢిల్లీలో రూ.1103గా ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో రూ.1100 నుంచి రూ.1150దాకా ఉంది. ఒక్కో సిలిండర్‌పై ఒకేసారి
రూ.200 తగ్గించడంతో ఇక నుంచి వంట గ్యాస్ రూ.903 నుంచి రూ.950 మధ్యలభించనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్
పొందుతోన్న పేదలకు మరింత ఊరట లభించింది. ఉజ్వల పథకం సిలిండర్లపై రూ.400 తగ్గించారు. వారికి ఒక్కో సిలిండర్ రూ.703కే లభిస్తుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు