నైరుతి
ఋతుపవనాలు మళ్ళీ పుంజుకుని వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా
వేసింది. వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టులో కురిసినా సెప్టెంబరులో ఋతుపవనాలు
మళ్ళీ పుంజుకుని వానలు కురవనున్నాయని పేర్కొంది.
ఈ వారాంతంలో
కూడా దక్షిణాది, మధ్య భారతదేశ వ్యాప్తంగా వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్
మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. సెప్టెంబర్‌కు దీర్ఘకాల సగటువర్షపాతం, 167.9
మిల్లీమీటర్లు కాగా దానిలో 9 శాతం అటుఇటూగా నమోదవుతుందని చెప్పారు.
ఒకవేళ
ఎక్కువగా కురిసినా జూన్-సెప్టెంబర్ కాలపు సగటు వర్షపాతం మాత్రం సాధారణం కంటే తక్కువగానే
ఉండవచ్చని అంచనా వేస్తోంద. జులైలో
అధిక వర్షాల పడినా తర్వాత ఆగస్టులో చాలా వరకు రుతుపవనాల్లో కదలిక లేదు. ఎలినినో
కారణంగా చాలా ప్రదేశాల్లో 20రోజులుగా వానలు పడలేదు.
ఆరేబియా
మహాసముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఇప్పుడు
ఎలినినో సానుకూలంగా మారడం మొదలైంది. దీంతో పాటు తూర్పు దిశగా మేఘాల పయనం, ఉష్ణమండల
ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయి.
దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.