ఇస్రో
చైర్మన్ సోమనాథ్ గురువారం ఇండిగో విమానంలో ప్రయాణించారు. విమానం గాల్లోకి లేచే
ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను ఇండిగో సిబ్బంది గౌరవించింది. ఆయన తమ
విమానంలో ప్రయాణించడాన్న అపురూపంగా భావించాయి.
‘‘
ఈ రోజు విమానంలో మనతో పాటు ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నారు. మీరు మాతో పాటు ఉన్నందుకు
ఎంతో సంతోషంగా ఉంది. మీకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. దేశం గర్వపడేలా చేసినందుకు
ధన్యవాదాలు’’ అంటూ ప్రశంసించారు. ప్రయాణికులు, ఇండిగో సిబ్బంది చప్పట్లతో
అభినందనలు తెలిపారు.
సోమనాథ్
కు ఎయిర్హోస్టెస్ ఫుడ్ ట్రే ఇస్తూ ఇండిగో తరఫున ఓ గ్రీటింగ్ కార్డును కూడా
అందించింది.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంలో మన
శాస్త్రవేత్తలు విలువ కట్టలేని పాత్ర పోషించారు. భారత కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా
రెపరెపలాడించారు. దీంతో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఇస్రో
చైర్మన్ సోమనాథ్ను ఇండిగో, ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో సత్కరించింది. ఆయన విమాన ప్రయాణ వీడియోను ఇండిగో సోషల్
మీడియాలో పంచుకోగా కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు