దక్షిణ ఆఫ్రికాలోని అతిపెద్ద పట్టణం జొహానెస్బర్గ్లో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 73కు పెరిగింది. వీరిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఓ ఐదంతస్తుల భవనంలో గత అర్థరాత్రి దాటిన తరవాత జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. అనధికారికంగా ఆ భవనంలో నివసిస్తోన్న నిరాశ్రయులను అక్కడ నుంచి తరలించారు. ప్రమాదం జరిగిన భవనంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అత్యవసర సర్వీసుల విభాగం అధికారి తెలిపారు. నా ఇరవైయేళ్ల ఉద్యోగ జీవితంలో ఇంతటి ఘోర విషాదం చూడలేదని సహాయక చర్యలు పర్యవేక్షిస్తోన్న అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో జరిగిన మూడు అగ్ని ప్రమాదాల్లో ఇది కూడా ఒకటని స్థానిక వార్తా ఛానల్ ప్రసారం చేసింది. గత రెండు నెలల్లోనే మూడు అగ్ని ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోపల అనేక అనధికార నిర్మాణాలు చేసినట్టు అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున చెత్తా చెదారం పేరుకుపోయిందని అది తొలగించాల్సి ఉందని అత్యవసర సర్వీసుల సిబ్బంది వెల్లడించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు