వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇవాళ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. గంటకుపైగా వారితో చర్చలు జరిపారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆమె భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
కేసీఆర్‌కు కౌంట్ డౌన్ మొదలైందని భేటీ అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం వైఎస్ బిడ్డగా తాను నిరంతరం పనిచేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ఆర్టీపీ విలీనం గురించి ప్రస్తావించలేదు. తెలంగాణలో జరుగుతోన్న పరిణామాల గురించి సోనియా, రాహుల్‌తో చర్చించినట్టు మాత్రమే షర్మిల చెప్పారు. సెప్టెంబరు 2న వైఎస్ జయంతిని పురస్కరించుకుని అధికారికంగా పార్టీ విలీనం ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ ముగిసిన తరవాత మొదటగా తెలంగాణలో, ఆ తరవాత ఏపీలో షర్మిళ సేవలు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు