ఎక్స్ వేదికగా ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. త్వరలో ఎక్స్‌లో వీడియో, ఆడియో కాల్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. అంతే కాదు ఈ కాల్స్ చేయడానికి ఫోన్ నెంబరు అవసరం లేదని చెప్పడం విశేషం. ఎక్స్‌లో ఈ సదుపాయం త్వరలో అందుబాటులో వస్తుందని మస్క్ వెల్లడించారు.
ఆండ్రాయిడ్, మ్యాక్ అండ్ పీసీ, ఐవోఎస్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ట్వీట్ చేశారు. ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్‌కు ఎక్స్ వేదిక కానుందని అన్నారు. ఇందులో ఫీచర్లు ఖాతాదారులకు ఆకర్షిస్తాయని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ కొనుగోలు చేసిన తరవాత మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చారు. అందులో వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. టిక్ మార్క్ కోసం ఖాతాదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఎక్స్ నుంచి త్వరలో వీడియో, ఆడియో కాల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించి సంచలనానికి తెరతీశారు.