జమ్ముూ –కశ్మీర్లో ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు
తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారుల సంయుక్తంగా తుదినిర్ణయం తీసుకోవాల్సి
ఉంటుందని, నిర్వహణ బాధ్యత కూడా వారిదేనని ధర్మాసనానికి వివరించింది.
ఆర్టికల్
370 రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ పెద్దసంఖ్యలో దాఖలైన పలు పిటిషన్లను
విచారిస్తున్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం,
జమ్మూ-కశ్మీర్ లో ఎన్నికల ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాలపరిమితిని పేర్కొనాల్సిందిగా
కేంద్రాన్ని ఆదేశించింది. స్పందించిన కేంద్రం.. ఏ క్షణాన అయినా ఎన్నికలు వచ్చినా సిద్ధంగా
ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలను దశల
వారీగా నిర్వహిస్తారని వివరించింది.
అత్యున్నత
స్థాయి సమావేశం తర్వాత ఆగస్టు 31 నాటికి
జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సానుకూల ప్రకటన వచ్చే అవకాశం
ఉందని పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వం
తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా , దేశంలో అందరినీ
సమానంగా చూసేలా, వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చే రాజ్యాంగ మార్పును
తప్పుబట్టలేమన్నారు. జమ్మూ కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికంగానే
ఉంచనున్నామని, లద్ధాఖ్ మాత్రం యూనియన్ టెరిటరీగానే ఉంటుందని తెలిపారు. తగిన సమయంలో
జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర హోదా ప్రకటిస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను గుర్తు చేశారు.
2018
నుంచి 2023 వరకు పోలిస్తే ఉగ్రవాద కేసులు 45.2 శాతం తగ్గాయని, చొరబాట్లు 90 శాతం
మేర తగ్గుముఖం పట్టాయని, శాంతి భద్రతల సమస్య 97 శాతం తగ్గిందని కేంద్రం తెలిపింది.
భద్రతా సిబ్బంది ప్రమాదాలు 65 శాతం తగ్గగా, రాళ్ళ దాడులు, బందులు వంటి ఘటనలు
చోటుచేసుకోలేదని కేంద్రం సుప్రీంకు తెలిపింది.
అధికరణం
370ను 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. దీంతో జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి
హోదాను కోల్పోయింది. దీనిపై పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు కావడంతో అత్యున్నత
న్యాయస్థానం.. సోమ, శుక్రవారాలు మినహా రోజువారీ విచారణ చేపట్టింది.
చీఫ్
జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్
బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం వాదనలు
వింటోంది.
ఆర్టికల్
370 రద్దు తర్వాత జమ్మూ-కశ్మీర్ లో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా
జరుగుతున్నాయి. చట్ట పరమైన అడ్డంకులు లేకపోవడంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు
పెరిగాయి. అలాగే పర్యాటకుల సంఖ్య కూడా చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు