దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరం జొహానెస్బర్గ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 60 మంది సజీవ దహనం అయ్యారు. ఈ భవనంలో 200 మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నట్టు తెలుస్తోంది. ప్రమాద మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు తెలిపారు.
జొహానెస్బర్గ్లోని ప్రధాన వ్యాపార ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదు. అంతా నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 60 మంది బలయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చినా, భవనమంతా దట్టమైన పొగలు వ్యాపించాయని మృతులను గుర్తించడం కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. దట్టమైన పొగల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 58 మంది చనిపోగా, 40 మంది గాయపడ్డట్టు ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు వెల్లడించారు. 200 మంది నిరాశ్రయులు ఎలాంటి ఒప్పందాలు లేకుండానే ఈ భవనంలో నివశిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద కారణాలను అగ్నిమాపక సిబ్బంది ఇంకా గుర్తించాల్సి ఉంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు