సైబర్
నేరాలు రోజురోజుకూ పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు మండిపడింది. సాధారణ వ్యక్తుల
నుంచి ఉన్నత సంస్థల వరకూ సైబర్ నేరగాళ్ళ బాధితుల జాబితాలోని వారేనని అత్యున్నత
న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు పేరిట దొంగ యూఆర్ఎల్ సృష్టించి ప్రజల
వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, సైబర్ మోసాల విషయంలో జాగ్రత్తగా
మెలగాలని పౌరులకు సూచించింది.
పౌరుల
వ్యక్తిగత సమాచార చౌర్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత
సమాచారం దొంగిలించడంతో పాటు గోప్యతకు భంగం వాటిల్లేలా కొన్ని వెబ్సైట్లు
ప్రోత్సహిస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ వెబ్సైట్ల
వ్యవహారంపై సలహా కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, సైబర్ నేరాల విషయంలో జాగురూకతతో వ్యవహరించాలని ప్రజలను
హెచ్చరించింది.
అత్యున్నత
న్యాయస్థానం పేరిట నకిలీ వెబ్సైట్ లింక్ క్రియేట్ చేసి సమాచారం సేకరిస్తున్న
విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. http://cbind/scigv.com, http://cbins.scigv.com/offence అనే లింకులు సృష్టించిన సైబర్
కేటుగాళ్ళు, నేరాలకు పాల్పడుతున్నారు.
రెండో
లింకును తరుచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న దుండగులు, దాని ద్వారా వ్యక్తిగత వివరాలతో పాటు
ఇంటర్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.
ఈ
మోసాల విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళడంతో సలహా కమిటీ వేసిన ధర్మాసనం, డిజిటల్ మోసాల విషయంలో అప్రమత్తంగా
వ్యవహరించాలని సూచించింది.
పౌరుల వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలు, మరే
ఇతర రహస్య సమాచారాన్ని సుప్రీంకోర్టు సేకరించదని వెల్లడించింది.
ఫిషింగ్
వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని
దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.
www.sci.gov.in మాత్రమే సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ అని పేర్కొన్న అత్యున్నత
న్యాయస్థానం, యూఆర్ఎల్ పై క్లిక్ చేసే ముందు
జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.
ఇప్పటికే
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఉంటే, ఆన్
లైన్ ఖాతాల పాస్ వర్డ్స్ మార్చుకోవాలని, అనధికార
ఆర్థిక లావాదేవీలపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సలహా కమిటీ
స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు