ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం దేవస్థానం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి లలితాంబికా కాంప్లెక్సు ఎల్ బ్లాకులోని దుకాణాల్లో ఈ ప్రమాదం జరిగింది. అగ్ని కీలలకు 15 దుకాణాలు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే సమయానికే 15 దుకాణాలు కాలిపోయాయని స్థానికులు తెలిపారు.
మంటలు మరింత విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న కూడా ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితికి సమీక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ.2 కోట్ల ఆస్థినష్టం వాటిల్లినట్లు దుకాణదారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాద కారణాలపై అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు