సార్వత్రిక
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ దేశరాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష
పార్టీలు అప్పుడే ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాయి. పోటాపోటీ సమావేశాలు, ప్రజాకర్షక
నినాదాలతో ప్రజల్లోకి వెళ్ళేందుకు శ్రమిస్తున్నారు. ప్రచారం పర్వంలో పైచేయి
సాధించేందుకు సోషల్ మీడియా సహా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికల సంగ్రామంలో
విజయపతాకం ఎగరవేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ముంబై
లో I.N.D.I.A భాగస్వామ్య పార్టీల సమావేశానికి ముందే
బీజేపీ కూడా సరికొత్త ప్రచారానికి తెరతీసింది. అత్యంత
ప్రజాదరణ పొందిన హాలీవుడ్ సినిమా టెర్మినేటర్ హీరో వేషధారణ తోపాటు ‘‘ఐ విల్ బీ బ్యాక్’’ అనే
ఫేమస్ డైలాగ్ తో జనాన్ని ఆకర్షిస్తోంది.
ఎన్డీయే
ఓటమి కోసం విపక్షాలు చేసే ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావనే అర్థం స్ఫురించేలా ఈ
డైలాగ్ ను ఉపయోగించుకుంటున్నారు.
మోదీ ఫేస్
తో ఎడిట్ చేసిన టెర్మినేటర్ పోస్టర్ దాని పై ‘‘2024 ఐ విల్ బీ బ్యాక్’’ అనే
క్యాప్షన్ ఉంచారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు అంటించారు. ఈ మార్ఫింగ్ పోస్టర్ ను బీజేపీ తన అధికారిక సోషల్
మీడియా ఖాతాలో ఫాలోవర్స్ తో పంచుకుంది. పోస్టర్ లో పెద్ద సైజు కమలం పువ్వును కూడా ముద్రించారు.
ఆగస్టు
31న I.N.D.I.A లోని 26 పార్టీల ప్రతినిధులు ముంబైలో
సమావేశమై సమాలోచనలు చేస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఎన్నికల యద్ధతంత్రంపై
చర్చించనున్నారు.
బీజేపీ
నేతృత్వంలోని మహారాష్ట్ర పాలక కూటమి కూడా రెండురోజుల పాటు రాజకీయ సదస్సు
నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 48 లోక్సభ సీట్లలో గెలుపు కోసం
అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు ఈ భేటీ జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు
వెల్లడించాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తో పాటు ఉపముఖ్యమంత్రులు
దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు