తిరుమల
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ
చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అధిక శ్రావణమాసం కారణంగా
శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపిన కరుణాకర్ రెడ్డి.. సంబంధిత
పోస్టర్ ను అధికారుల సమక్షంలో విడుదల చేశారు.
సెప్టెంబర్
22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రధోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజా అవరోహణం
నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ మోహన్ రెడ్డి,
సెప్టెంబర్ 18న పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
బ్రహ్మోత్సవాల
సమయంలో రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్న కరుణాకర్ రెడ్డి, ఏడు
రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు.
తిరుమలలో
సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డి, భక్తుల భద్రత విషయంలో ఎలాంటి
లోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నవరాత్రి
బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల
కారణంగా సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అష్టాదళ పాద
పద్మారాధన, తిరప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ
రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత
బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే
అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పరణ సందర్భంగా అక్టోబర్ 14న
సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు