చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో రన్నరప్, రజత పతక విజేత ప్రజ్ఞానందకు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్ఞానందకు వేల సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. సీఎం స్టాలిన్ ప్రజ్ఞానందను సత్కరించి రూ.30 లక్షల చెక్కు అందజేశారు. దేశం గర్వపడేలా ప్రతిభ కనబరిచాడంటూ ప్రజ్ఞానందను సీఎం స్టాలిన్ కొనియాడారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులతోనూ సీఎం ముచ్చటించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రజ్ఞానందను సత్కరించిన వీడియోను కూడా స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ చూపారని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కొనియాడారు. రన్నరప్‌గా నిలిచినందుకు ప్రజ్ఞానందను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఈవీ కారు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్టు ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి ప్రజ్ఞానంద స్పందిస్తూ తన తల్లిదండ్రుల కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు చెప్పేందుకు కూడా తనకు మాటలు రావడం లేదన్న ప్రజ్ఞానంద, తన తల్లిదండ్రుల చిరకాల కోరిక నిజం చేసినందుకు మహీంద్రా సర్‌కు నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. కార్ల తయారీదారుల అంతిమ లక్ష్యం వినియోగదారుల కలలు నెరవేర్చడమేనంటూ ఆనంద్ మహీంద్రా సమాధానం ఇచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు