ఆకాశంలో
ఇవాళ సాయంత్రం అద్భుతఘట్టం ఆవిష్కృతం కానుంది. సహజ చంద్రుడికి బదులుగా అరుదైన
సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది. ఈ పౌర్ణమినాడు చంద్రుడు, భూమికి అత్యంత చేరువలో అంటే
కేవలం 3,57,244 కిలోమీటర్ల దూరంలో దర్శనం ఇవ్వనున్నాడు.
ఆగస్టు
1న తొలి పౌర్ణమి నాడు కూడా బ్లూ మూన్ దర్శనమిచ్చింది. నేడు కనిపించే చంద్రుడిని
సూపర్ బ్లూ మూన్ గా పిలుస్తారు. రాత్రి 8 గంటలకు ఆ అద్భుతాన్ని వీక్షించవచ్చు.
ఒకే
నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూమూన్ గా పిలుస్తారు. ఒకే నెలలో
బ్లూ మూన్, సూపర్ మూన్ కనిపించడం అరుదైన విషయం. బుధవారం ఏర్పడబోయే బ్లూ మూన్
ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత
ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16
శాతం ఎక్కువగా వెన్నెల కురిపిస్తాడు.
బ్లూ
మూన్ చాలా అరుదుగా కనిపిస్తుందని, ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పదేళ్ళకు మాత్రమే
ఇలాంటి దృశ్యం కనిపిస్తుందని నాసా తెలిపింది. ఒక్కోసారి బ్లూమూన్ రావడానికి 20
ఏళ్ళు కూడా పట్టొచ్చని పేర్కొంది. గతంలో 2009లో ఏర్పడగా, మళ్ళీ 2037లోనే
కనిపిస్తుందట. అంటే ఇవాళ చూడకపోతే మరో 14 ఏళ్ళ వరకు అంతరిక్షంలో జరిగే అద్భుతాన్ని
చూడలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇటీవల
శనిగ్రహం కనిపించగా, అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్,
గురుడు, నెప్ట్యూన్, శనిగ్రహాలు ఒకే వరుసలోకి వచ్చాయి. ఎలాంటి పరికరాలు అవసరం
లేకండానే ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఈ సాయంత్రం అరుదైన
బ్లూ మూన్ దర్శనం ఇవ్వనుంది.