చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుమోపి ప్రపంచాన్ని
ఓ కుదుపు కుదిపేసిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం అనుకున్న లక్ష్యాలను
సాధించే దిశగా అడుగులు వేస్తోంది. చంద్రుడి ఉపరితలం మీద దిగిన ప్రజ్ఞాన్ రోవర్…
ఆ తలం మీద ఉన్న మూలకాలను శోధిస్తోంది. ఆ క్రమంలోనే… చంద్రతలంపై గంధకం, ఆమ్లజని
వంటి మూలకాల ఉనికిని గుర్తించింది.
ప్రజ్ఞాన్ రోవర్‌లోని కీలకమైన లేజర్ ఇండ్యూస్డ్
బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ చంద్రతలం మీది మూలకాలను విశ్లేషించింది. అక్కడ ఆక్సిజన్,
అల్యూమినియం, కాల్షియం, ఇనుము. క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, సిలికాన్ వంటి మూలకాల
ఉనికిని కనుగొంది. ఆ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో
ధ్రువీకరించింది. ఇక ఇప్పుడు అక్కడ హైడ్రోజన్ జాడ కోసం రోవర్ అన్వేషిస్తోందని
వెల్లడించింది.
విక్రమ్ ల్యాండర్ ఇప్పటికే చంద్రుడి ఉపరితలం మీద
ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలను గుర్తించిన విషయం తెలిసిందే.