ఆసియాకు
చెందిన ఆరు దేశాలుతలపడే ఆసియా కప్క్రికెట్ టోర్నమెంట్ కాసేపట్లో
ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి శ్రీలంక, పాకిస్తాన్ సంయుక్తంగా ఆతిథ్యం
ఇస్తుండగా, తొలి మ్యాచ్ లో పాకిస్తాన్, నేపాల్ జట్లు మధ్యాహ్నం 3 గంటలకు తలపడనున్నాయి.
గ్రూప్ దశలో సెప్టెంబర్ 2న పాకిస్తాన్ తోనూ, 4న నేపాల్ తోనూ భారత్ ఆడనుంది.
పాకిస్తాన్,
శ్రీలంక వేదికగా దాదాపు నాలుగు స్టేడియాల్లో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్ లోని
ముల్తాన్, లాహోర్ తో పాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాల్లో మ్యాచ్లు
నిర్వహించనున్నారు. టీమిండియా తన మ్యాచ్లు
అన్నింటిని శ్రీలంకలోనే ఆడనుంది.
గ్రూప్-ఏ
లో భారత్, పాకిస్తాన్, నేపాల్… గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి.
రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత
సాధిస్తాయి.
ప్రస్తుతం
16వ ఆసియాకప్ జరుగుతుంది. గత 15 ఆసియాకప్పు టోర్నీల్లో 13 వన్డే ఫార్మాట్లోనే
జరిగాయి. రెండు సార్లు మాత్రమే టీ-20 ఫార్మాట్లో నిర్వహించారు. గత టోర్నీలో
టీ-20క్రికెట్ ఆడారు. ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సారి వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ ఆడుతున్నారు.
టోర్నీలో భారత్ అత్యధికంగా 7 సార్లు విజేతగా నిలిచింది. 49 వన్డే మ్యాచ్లు ఆడిన టీమిండియా
31 సార్లు నెగ్గింది.
భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగే మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో
ఆసక్తిరేపుతోంది. గత టోర్నీల్లో రెండు జట్లు చెప్పకోదగిన స్థాయిలో రాణించాయి.
ఆసియాకప్ లో ఇరుదేశాల జట్లు 13 సార్లు పోటీపడ్డాయి. ఏడుసార్లు భారత్, ఐదుసార్లు
పాక్ గెలిచాయి.
2018లో
తలపడ్డ రెండుసార్లూ టీంమిండియానే పైచేయి సాధించింది. పాక్ గత ఐదు ఆసియాకప్ మ్యాచ్
ల్లో భారత్ నాలుగు సార్లు విజయం సాధించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు