సీపీఎస్ రద్దు చేయాలంటూ ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు ఫలించలేదు. ఓపీఎస్కు సమానమైన జీపీఎస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఆ ముసాయిదా తమకు అందిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. జీపీఎస్ ముసాయిదా మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశానికి పలు ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. వారి డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘం ముందుంచారు.
ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు అర్థంతరంగా ముగిశాయి. 3.5 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీపీఎస్ అంగీకరించేది లేదని ప్రభుత్వానికి ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఓపీఎస్కు సమానమైన జీపీఎస్ తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై కసరత్తు జరుగుతోంది. జీపీఎస్ ముసాయిదా తయారు చేస్తున్నారు. అందులో పొందుపరచిన వివరాలు పరిశీలించిన తరవాతే తమ నిర్ణయం వెల్లడిస్తామని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మీడియాకు వెల్లడించారు. జీపీఎస్ గురించి అయితే ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరం లేదని, సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వంతో జరిపిన సమావేశాలను బహిష్కరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు