అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో దూసుకెళుతున్నాయి. వరుసగా మూడో రోజూ సూచీలు లాభాలను నమోదు చేశాయి. ప్రారంభంలోనే 289 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 65364 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 19424 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.56 వద్ద స్థిరంగా ఉంది. టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టి, టాటా మోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిల్టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
మంగళవారం సాయంత్రం యూఎస్, ఐరోపా మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. వీటి ప్రభావంతో నేడు దేశీయ స్టాక్ సూచీలు పాజిటివ్ ట్రెండ్‌లో ప్రారంభం అయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా షేర్లు కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతాయనే వార్తలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో తుఫాను ప్రభావంతో చమురు ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు 84.76 డాలర్లకు చేరింది. ప్రస్తుతానికి చమురు ధరల ప్రభావం స్టాక్ మార్కెట్లపై చూపలేదు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు