తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నేషనల్
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో
ఇరుక్కున్న తన మాజీ పీఏ గురించి విచారించేందుకు కొచ్చిలోని తమ కార్యాలయంలో హాజరవ్వాలని
ఆదేశించారు.
ఆదిలింగం అనే వ్యక్తి వరలక్ష్మి దగ్గర కొంతకాలం
పీఏగా పనిచేసారు. అతనికి మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు
ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అతణ్ణి కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్
సరఫరా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆదిలింగం సినిమా రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు
గుర్తించారు. ఆ క్రమంలోనే ఆ వివరాల కోసం వరలక్ష్మికి సమన్లు జారీ చేసారు, ఆమె
వాంగ్మూలం తీసుకోనున్నారు.
ఎన్ఐఏ అధికారులు
ఆదిలింగం నుంచి రూ. 2100 కోట్ల విలువైన 300 కేజీల హెరాయిన్, ఏకే 47 తుపాకీ, 9 ఎంఎం తుపాకులు,
మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు