వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గృహోపయోగ వంటగ్యాస్‌పై ఒకేసారి రూ.200 తగ్గించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన గ్యాస్ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
ప్రస్తుతం వంట గ్యాస్ ధర ఢిల్లీలో రూ.1103గా ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో రూ.1100 నుంచి రూ.1150దాకా ఉంది. ఒక్కో సిలిండర్‌పై ఒకేసారి రూ.200 తగ్గించడంతో ఇక నుంచి వంట గ్యాస్ రూ.903 నుంచి రూ.950 మధ్య లభించనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ పొందుతోన్న పేదలకు మరింత ఊరట లభించింది. ఉజ్వల పథకం సిలిండర్లపై రూ.400 తగ్గించారు. వారికి ఒక్కో సిలిండర్ రూ.703కే లభిస్తుంది. ఈ పథకం కింద కొత్తగా మరో 75 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు. 2019లో ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటికే 9.55 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు. దాదాపు 40 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు