తోషాఖానా కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపేసింది. తోషాఖానా అవినీతి కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్ష రద్దు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు, ఇవాళ తీర్పును వెలువరించింది.
ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా చేసినప్పుడు వచ్చిన బహుమతులను తోషాఖానా నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, తరవాత ఎక్కువ ధరకు అమ్ముకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై గతంలోనే కేసు నమోదైంది. దీనిపై విచారించిన ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో
పాల్గొనకుండా అనర్హత వేటు కూడా వేసింది. తీర్పు రాగానే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసి అటక్ జిల్లా జైలులో ఉంచారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ఊరట లభించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు