ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 500 మీటర్లలోపు లేఅవుట్లకు మాత్రమే అనుమతి అనే నిబంధన తొలగించారు. ఈ నిబంధన వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాల్లో 500 మీటర్ల నిబంధన వల్ల ఫీజుల రూపంలో
రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున కోల్పోతోంది. రియల్ఎస్టేట్ పడకేయడం, ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో ఈ నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గుంటూరు, విజయవాడ, తెనాలి డెవలప్మెంట్ పరిధిలోని సాగు భూముల్లో నివాసాల అభివృద్ధికి గతంలో 500 మీటర్ల నిబంధన పెట్టారు. ఏపీ సీఆర్డీఏ ఏర్పాటయ్యాక కూడా అదే నిబంధన కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలోని గ్రామాలకు 500 మీటర్లలోపే లేఅవుట్లు వేయాలనే నిబంధన తొలగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో జారీ చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు