పాకిస్థాన్‌లో భారత హై కమిషనర్‌గా గీతిక శ్రీవాస్తవను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాక్ అంబాసిడర్‌గా ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి. డాక్టర్ ఎం.సురేష్ కుమార్ స్థానంలో గీతికను నియమించారు. ప్రస్తుతం ఈమె విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు.
కామన్‌వెల్త్ దేశాల్లో భారత్ విదేశీ వ్యవహారాలు చూసే కార్యాలయాలను హై కమిషన్స్ అని, నాన్ కామన్‌వెల్త్ దేశాల్లో ఎంబసీలని వ్యవహరిస్తున్నారు. 2019 ఆగష్టు నుంచి న్యూఢిల్లీలోనూ, ఇస్లామాబాద్‌లోనూ పూర్తి స్థాయి హై కమిషనర్ల నియామకం జరగలేదు. ఛార్జ్ డి అఫైర్స్ నేతృత్వంలో విదేశీ వ్యవహారాలు నడుస్తున్నాయి.
2019లో ఆర్టికల్ 370 రద్దు తరవాత పాకిస్థాన్ హైకమిషన్ స్థాయిని తగ్గించారు. రద్దు ముందు వరకు అక్కడ అజయ్ బిసారియా భారత హై కమిషనర్‌గా వ్యవహరించారు.
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరవాత మొదటి సారిగా పాక్‌లో భారత హై కమిషనర్‌గా శ్రీప్రకాస బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2019 వరకు 22 మంది పనిచేశారు. తాజాగా 2005 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన గీతిక శ్రీవాస్తవను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2007 నుంచి 2009 వరకు గీతిక చైనాలో హై కమిషనర్‌గా పనిచేశారు. తరవాత కోల్‌కతా రీజనల్ పాస్‌పోర్టు అధికారిగా, ఇండియన్ ఓషన్ రీజియన్
డివిజన్ డైరెక్టర్‌గా పదవులు నిర్వహించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు