వైసీపీ మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో రోజా భర్త, డైరెక్టర్ ఆర్‌కె.సెల్వమణిపై చెన్నైలోని జార్జ్‌టౌన్ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రోజా భర్త పలు సినిమాలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆర్థిక వ్యవహారాల్లో ముకుంద్‌చంద్ అనే ఫైనాన్షియర్ 2016లో అరెస్టయ్యారు. ముకుంద్‌చంద్ కారణంగా తాను కూడా ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సెల్వమణి చేసిన వ్యాఖ్యలపై ముకుంద్‌చంద్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. కేసు విచారణలో ఉండగానే ముకుంద్‌చంద్ చనిపోయారు. ఆ కేసును ఆయన కుమారుడు
గగన్‌బోత్రా కొనసాగించారు. కేసు విచారణ సమయంలో సెల్వమణి హాజరుకాకపోవడంతో చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు న్యాయమూర్తి సోమవారంనాడు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంటు జారీ చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు