తిరుమల
తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
దాఖలైంది. పలు కుంభకోణాల్లో నిందితులు, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారికి
పాలకమండలిలో చోటు కల్పించడాన్ని తప్పుబడుతూ చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
తిరుమల
తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను,
కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాన్ని ఆయన సవాల్ చేఃవారు. ఈ ముగ్గురిని
బోర్డు నుంచి తప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
కోట్లాది
మంది వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా బోర్డు సభ్యుల నియామకం ఉందని
న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
టీటీడీ
నూతన చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం
తీసుకోవడాన్ని కూడా పలు హిందూ సంఘాలు తప్పుబట్టాయి. ఆయన మతంపై ప్రజల్లో ఉన్న అనుమానాలతో
పాటు, నాస్తికుడే అనే ప్రచారాన్ని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు.
టీటీడీ
పాలకమండలి నియామకం విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ రాష్ట్ర శాఖ
తప్పుబట్టింది. తిరుమల పవిత్రతపై సీఎం జగన్ కు నమ్మకం లేదంటూ ధ్వజమెత్తిన బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి.. కుంభకోణాల్లో భాగస్వాములుగా ఆరోపణలు
ఎదుర్కొంటున్న వారికి చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు