జాబిల్లిపై
చక్కర్లు కొడుతున్న భారతీయ ప్రజ్ఞాన్ రోవర్ , తన అధ్యయనంలో ఎదురువుతున్న సవాళ్లను
చాకచక్యంగా సురక్షితంగా అధిగమిస్తోంది. తాజాగా తన మార్గంలో అడ్డుగా ఉన్న నాలుగు
మీటర్ల గొయ్యిని తప్పించుకుని కొత్త దారిలో ప్రయాణం కొనసాగిస్తోంది.
చందమామ
దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనలతో తీరికలేకుండా గడుపుతోంది.
లక్ష్య సాధనలో భాగంగా భారీ గొయ్యి నుంచి తప్పించుకుంది. జాబిల్లి పై అధ్యయనంలో బాగంగా ప్రయాణిస్తుండగా,
అడ్డుగా లోతైన గొయ్యి కన్పించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో శాస్త్రవేత్తలు
రోవర్ రూట్ ను మార్చారు.
రోవర్
ఉన్న ప్రాంతానికి మూడు మీటర్ల దూరంలో ఆగస్టు 27 న భారీ గొయ్యి కన్పించింది. నాలుగు మీటర్ల
వ్యాసంతో గొయ్యి ఉండటంతో రోవర్ మార్గాన్ని మార్చుకోవాలని కమాండ్ పంపారు. వెంటనే
స్పందించిన రోవర్ దారి మార్చుకుని కొత్త మార్గంలో ప్రయాణిస్తోంది. అడ్డుగా ఉన్న గొయ్యి ఫొటోను కూడా షేర్ చేసింది.
రోవర్ లోని నావిగేషన్ కెమెరా ద్వారా ఈ గోతిని గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు
తెలిపారు. కొత్త మార్గంలో రోవర్
ప్రయాణించిన గుర్తులను కూడా వెల్లడించారు.
చంద్రయాన్
3 రోవర్ లూనార్ డే ప్రయాణానికి ఇంకా
పదిరోజులే మిగిలి ఉన్న తరుణంలో చంద్రుడిపై అత్యధిక బాగంలో అధ్యయనానికి
ప్రయతిస్తున్నట్లు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నిలేశ్ దేశాయ్ తెలిపారు.
సమయం తక్కువ ఉండటంతో చంద్రుడి ఉపరితలాన్ని సాధ్యమైనంత వరకు చుట్టివచ్చేందుకు ఆరు
చక్రాల ప్రజ్ఞాన్ ప్రయత్నిస్తోందని వివరించారు.
విక్రమ్
ల్యాండర్ లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ పరికరం.. చందమామ
ఉపరితలం పై 50.5 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే, 80 మిల్లీమీటర్ల లోతులో
మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు గుర్తించింది.
భారత్
ప్రయోగించిన చంద్రయాన్ 3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ద్రువంపై విజయవంతంగా
అడుగుపెట్టి ప్రపంచలోనే అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకుంది. తాజా విజయంతో అమెరికా, చైనా, రష్యా తర్వాతి
స్థానంలో మనదేశం నిలిచింది.
ఇస్రో
లక్ష్యానికి అనుగుణంగా స్పందిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై అధ్యయనానికి
సంబందించిన విషయాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో పంచుకుంటోంది. అడుగు మోపినప్పటి
నుంచి 14 రోజుల పాటు రోవర్ నడయాడేలా శాస్రవేత్తలు రూపకల్పన చేశారు.