సూర్యుడిపై
పరిశోధనలకు సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro) ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ముహూర్త సమయాన్ని ప్రకటించింది. సూర్యుడి
గురించి పరిశోధన కోసం ఉద్దేశించిన ఈ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ఉదయం 11:50 నిమిషాలకు ప్రారంభించనున్నట్లు
అధికారికంగా వెల్లడించింది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌరమండలంలోని వాతావరణం గురించి
తీక్షణంగా శోధన చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. పీఎస్ఎల్వీ-సి 57 రాకెట్ ఈ
ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్ళనుంది.
ఈ అద్భుత
ప్రయోగానికి సాక్షిగా నిలిచి వీక్షించాలనుకునే వారు, http://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp.
సంప్రదించాలని ఇస్రో సూచించింది.
ఆగస్టు 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కు అవకాశమిచ్చారు.
ఆదిత్య
ఎల్ 1 సూర్యుడిపై పరిశోధనకు తొలిసారిగా ప్రయోగిస్తున్న మిషన్ కావడం విశేషం. గ్రహణాలతో
సంబంధం లేకుండా నిరంతరం అధ్యయనం చేసేలా కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. భూమి
నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్1 (L1)చుట్టూ ఉన్న కక్ష్యలో దీనిని
ప్రవేశపెడతారు.
ఆదిత్య
ఎల్1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్ళనుంది. విద్యుదయస్కాంతం, అయస్కాంత డిటెక్టర్ల
సాయంతో సూర్యుడి వెలుపలి పొరలైన ఫొటోస్పియర్,
క్రోమోస్పియర్, కరోనాను పరిశీలించనుంది.
ఆదిత్య
ఎల్ 1 లక్ష్యాలు..
ఎగువ
సౌరమండలంలోని క్రోమోస్పియర్, కరోనా పై అధ్యయనంచేయడంలో ఈప్రయోగం ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా అతిదగ్గరి నుంచి
సౌరవ్యవస్థపై నిఘా పెట్టడంతో పాటు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులపై
కూడా పరిశోధనకు దోహదపడనుంది.
ఉపగ్రహ
బరువు 1500 కిలోగ్రాములు కాగా, సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన
కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్ లను రూపొందించారు.
ఎల్ 1
ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం
చేస్తాయి. మిగతా మూడు సౌర రేణువులు, అయస్కాంతక్షేత్రాల గురించి శోధన చేస్తాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా ఇతర దేశాల
అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో ఈ అధ్యయనాలు చేపడుతోంది.