రిలయన్స్ ఏజీఎం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ముంబయిలో జరిగిన 46వ రిలయన్స్ ఏజీఎంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గణేష్ చతుర్థి నాటికి జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు.
ఇక రిలయన్స్ బోర్డులోనూ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా చేశారు. ఇషా, ఆకాష్, ఆనంత్లను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశ వ్యాప్తంగా జియో కస్టమర్లు 45 కోట్లకు చేరుకున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పారు. 96 శాతం నగరాల్లో జియో 5జీ అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. డిసెంబరు నాటికి దేశమంతా 5జీ అందుబాటులోకి వస్తుందన్నారు. సగటున ఒక్కో జియో వినియోగదారుడు నెలకు 25 జీబీ నెట్ ఉపయోగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. జియో ఆదాయం ఏటా 20 శాతం పెరుగుతోందని చెప్పారు.
భారత్‌లో డిజిటల్ విప్లవానికి రిలయన్స్ జియో ఏడేళ్ల కిందట నాంది పలికిందని ముఖేష్ అంబానీ చెప్పారు. దేశంలోనే నెంబర్ వన్ పారిశ్రామిక గ్రూపుగా ఉన్న రిలయన్స్ చమురు, పాలియస్టర్, టెలికమ్యూనికేషన్స్, రిటైల్, గ్రీన్ ఎనర్జీ, ఫైనాన్స్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. రాబోయే రోజుల్లో బీమారంగంలోనూ భారీ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగంగా జామ్‌నగర్‌లో రూ.70000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
ఏజీఎం కీలక నిర్ణయాలు
జియో ఫైనాన్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు, 5జీని మరింత విస్తరించడం, రిలయన్స్ రిటైల్ ఐపీఓ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఐపీఓలతోపాటు, పునర్వినియోగ ఇంధన
రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ ఏజీఎం నిర్ణయించింది. రిలయన్స్ రిటైల్ దేశంలో నెంబర్ వన్, ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే 45 కోట్ల జియో వినియోగదారులు, నెలకు 280 జీబీ కంటే ఎక్కువ నెట్ ఉపయోగించే కోటి మంది జియో ఫైబర్ వినియోగారులున్న రిలయన్స్ ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు