పాఠశాలల్లో
ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ వస్త్రధారణ)పై నిషేధానికి ఫ్రాన్స్ పాలకవర్గం
సిద్ధమైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో పాటించాల్సిన లౌకిక చట్టాలకు
వ్యతిరేకంగా ఈ వేషధారణ ఉందని ఆ దేశ విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు.
రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. తాజా
నిర్ణయానికి సంబంధించిన విధివిధానాలను త్వరలో విద్యాశాఖ అధికారులకు తెలియజేస్తామని
చెప్పారు.
మతచిహ్నాలు
ధరించడంపై ఇప్పటికే ఫ్రాన్స్ పాఠశాలల్లో నిషేధం కొనసాగుతోంది. బడి చదువులపై కేథలిక్
మత ప్రభావం పడకుండా ఉండేందుకు 19 శతాబ్దం నుంచే ఈ చట్టాలను అమలు చేస్తోంది.
తాజాగా
ఆ దేశంలో ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో ఆ వర్గాల విద్యార్థుల పాఠశాల
వస్త్రధారణపై కూడా నిర్ణయం తీసుకుంది.
సిలువ
గుర్తులు, ఇస్లామిక్ హిజాబ్, యూదుల టోపీలకు అనుమతి లేదు. దేశవ్యాప్తంగా 2004లో
హిజాబ్ పై నిషేధం విధించగా, 2010లో ముఖానికి ముసుగు కప్పుకోవడంపై కూడా ఆంక్షలు
విధించింది. ప్రభుత్వ నిర్ణయంపై దేశంలోని 50 లక్షల ముస్లింలు ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు.
విద్యార్థులు
అబయను ధరించడం నిషేధం విధించనున్నట్లు తెలిపిన ఆ దేశ విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్
అట్టల్.. విద్యార్థులు తరగతి గదిలో అడుగుపెట్టిన వెంటనే వారి మతం ఎంటో తెలిపేదిగా
ఉండకూడదన్నారు. వస్త్రధారణ చూసి మతం ఏంటో చెప్పే పరిస్థితి సరికాదన్నారు.
ముస్లిం
స్త్రీలు ధరించే హిజాబ్ లపై నిషేధం విధించినప్పటి నుంచి అబయ ధారణపై చర్చ
జరుగుతుంది. పాలకవర్గ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ స్వాగతించగా వామపక్షాలు అభ్యంతరం
తెలియజేస్తున్నాయి. పౌరులు హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు