పేదరిక
నిర్మూలన, లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభమైన జన్‌ధన్
యోజన పథకం 9 ఏళ్లు పూర్తి చేసుకుంది.
2014
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ
ప్రకటించారు. అనంతరం రెండువారాల్లో ఈ అద్భుత పథకాన్ని ప్రారంభించి పేదలకు
బ్యాకింగ్ సేవలు దగ్గర చేశారు. పేదరికంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారికి ఉపశమనం
కలిగించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జన్‌ధన్ యోజన కీలకపాత్ర
పోషిస్తుందని ప్రధాని అభివర్ణించారు.
ప్రపంచంలోనే
అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో ఒకటైన పీఎంజెడీవై ద్వారా
కేంద్రప్రభుత్వం, సమాజంలో నిరాదరణకు గురువుతున్న, వెనకబడిన వర్గాలను ఆర్థిక
కార్యకలాపాల్లో భాగస్వాములు చేసేందుకు కృషి చేసింది. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో
లేని సమాజానికి, అల్పాదాయ వర్గాలకు సరసమైన ధరల్లో ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవడం
ద్వారా సమాన, సమ్మిళిత వృద్ధికి దోహదం చేసింది.
పేదరిక
నిర్మూలనలో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(PMJDY) విప్లవాత్మక
మార్పులకు దోహదం చేసిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రశంసించారు.ఈ పథకం ప్రారంభించి 9 ఏళ్ళు పూర్తి
చేసుకున్న సందర్భంగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. పేదవర్గాల నుంచి 50 కోట్ల మందికి
పైగా ప్రజలు జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించడం ద్వారా వ్యవస్థీకృత బ్యాకింగ్ రంగంలోకి రావడం హర్షణీయమన్నారు.
ఖాతాదారుల్లో 55.5 శాతం మహిళలు ఉండగా, 67 శాతం మంది గ్రామీణ, చిన్న పట్టణాల వారికి
బ్యాంకింగ్ సేవలు అందాయని వివరించారు. పీఎంజేడీవై ఖాతాల్లో మొత్తం డిపాజిట్ సొమ్ము
రూ. 2 లక్షల కోట్లు దాటిందని, అలాగే ఖాతాదారులకు 34 కోట్ల రూపే కార్డులు జారీ
చేయడంతో వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
ప్రభుత్వం,
బ్యాంకులు, బీమా కంపెనీలు, అధికారుల ఉమ్మడి కృషితో జన్‌ధన్
యోజన ఓ అద్భుత కార్యక్రమంగా నిలిచిందని సీతారామన్ కొనియాడారు. ప్రధాని
నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దేశ ఆర్థిక ముఖచిత్రం మారిందని వివరించారు.
‘‘పీఎంజేడీవై
తో దేశంలో ఆర్థిక అస్పృశ్యతను నిర్మూలించడంతో పాటు, అట్టడుగు వర్గాలకు బ్యాంకింగ్
సేవలు అందాయి. జన్‌ధన్ యోజన-ఆధార్- మొబైల్ (JAM)
విధానంతో లబ్ధిదారులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వ సాయం అందింది. సమాజంలో
నిరాదరణకు గురవుతున్న వర్గాల్లో సమ్మిళిత వృద్ధికి దోహదం చేసింది.’’ అని కేంద్ర
ఆర్థికశాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కదర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మొత్తంగా
ఈ పథకంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవినీతికి తావులేకుండా పోయింది. ప్రభుత్వం
పేదల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి లబ్ధిదారులకు నేరుగా చేరడంతో ఆర్థిక భద్రత
ఏర్పడింది.
2023
ఆగస్టు 9 నాటికి మొత్తం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల సంఖ్య 50.09 కోట్లుకు
చేరగా, ఖాతాదారుల్లో 27.82 కోట్ల మంది మహిళలు ఉన్నారు. గ్రామీణ, చిన్నపట్టణ
ప్రాంతాలకు చెందిన 33.45 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
యూపీఐ
వంటి మొబైల్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ సాయంతో డిజిటల్ లావాదేవీల పరిమాణం 2017-18
లో 1471 కోట్లు ఉండగా, 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 11,394 కోట్లకు పెరిగింది.
మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్య 2017-18 ఆర్థిక సంవత్సరం నాటి 92 కోట్ల నుంచి 2022-23నాటికి
8,371 కోట్లకు పెరిగింది.
పేదరిక
నిర్మూలనతో పాటు దేశఆర్థిక స్వరూపం మెరుగుపడేందుకు జన్‌ధన్ ఖాతాలు దోహదపడ్డాయి.
బ్యాంకింగ్ లావాదేవీలు కూడా సంతృప్తస్థాయిలో జరిగాయి. ప్రభుత్వ పథకాల సాయాన్ని
నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో వేయడంతో పాటు అధునాతన సాంకేతికత
అనుసంధానంతో పేదలకు ఆశించిన స్థాయి కంటే
ఎక్కువగానే మేలు జరిగింది.
అర్హత
కల్గిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా ప్రధానమంత్రి జన్‌ధన్ ఖాతా ప్రారంభించడంతో పాటు
ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండానే రూపే కార్డులు జారీ చేశారు. అలాగే రూ. 2 లక్షల
ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు పదివేల రూపాయల వరకు ఓవరు డ్రాఫ్ట్ కు
అవకాశమిచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు