భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. బుడాపెస్ట్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయుడు కూడా నీరజ్ చోప్రా కావడం విశేషం.
క్వాలిఫయర్స్‌లో తొలి ప్రయత్నంలో 88.77 మీటర్లు విసిరి ఫైనల్స్‌లో ప్రవేశించాడు. ఫైనల్స్‌లో తొలి ప్రయత్నం విఫలమైంది. రెండో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. రెండో ప్రయత్నంలో 88.17 మీటర్లు, ఆ తరవాత 86.32, 84.64, 87.73, 83.98 మీటర్లు విసిరాడు. నీరజ్‌తో పాటు మరో భారత అథ్లెట్ కిషోర్ జెనా పోటీ పడ్డారు. కిషోర్ జెనా 84.77 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. డీసీ మను 84.14 మీటర్లు విసిరి ఆరోస్థానం సాధించాడు.
మరోవైపు పురుషుల 4×400 మీటర్ల రిలే పరుగులో భారత జట్టు ఐదో స్థానంలో నిలిచింది. అమెరికా అథ్లెట్స్ 2 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం దక్కించుకున్నారు. భారత అథ్లెట్స్ 2 నిమిషాల 59 సెకన్లలో పరుగు పూర్తి చేసి ఐదో స్థానానికి పరిమితం అయ్యారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు