మథురలోని
శ్రీకృష్ణుడి జన్మభూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టులో
సోమవారం విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్
ఎస్వీన్ భట్టి సభ్యులుగా ఉన్నధర్మాసనం ఈ పిటిషన్‌దారుల వాదనలు విననుంది.
శ్రీకృష్ణుడి
జన్మభూమి ప్రాంతం వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి గతంలో పలువురు
సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 16న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, 10
రోజుల పాటు కూల్చివేతలు నిలిపివేయడంతో పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని
రైల్వేశాఖ అధికారులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసంది. గడువు ముగియడంతో స్టేటస్ కో పొడిగింపునకు
నిరాకరించిన సుప్రీంకోర్టు, ఆగస్టు 28కు
విచారణను వాయిదా వేసింది.
పిటిషన్
దారుడు యాకుబ్ షా వాదనలు మేరకు కేంద్రంతో పాటు సంబంధిత అధికారుల వివరణ కోరుతూ
అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
వందే
భారత్ లాంటి అధునాతన రైల్వే సర్వీసుల రాకపోకలకు వీలుగా మథుర నుంచి బృందావన్ వరకు
21 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీంతో
ఆగస్టు 9న కృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ
చేపట్టారు. దాదాపు 135 నివాసాలు తొలగించారు.
కుట్రపూరితంగా
ఇళ్లు తొలగిస్తున్నారంటూ పలువురు స్థానిక కోర్టును ఆశ్రయించారు. యూపీ లో
న్యాయవాదుల ఆందోళన కారణంగా విచారణ ఆలస్యమైంది. దీంతో పిటిషన్ దారులు అప్పట్లో
సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం
పదిరోజుల పాటు కూల్చివేతలు చేపట్టవద్దంటూ ఆదేశాలిచ్చింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు