స్టాక్ మార్కెట్లో అనూహ్య నష్టాలతోపాటు ఊహించని లాభాలు కూడా ఉంటాయి. కొన్ని షేర్లు నేల చూపులు చూస్తుంటే మరికొన్ని రాకెట్లా దూసుకుపోతున్నాయి. గడచిన ఐదు నెలలుగా సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేరు దూసుకెళుతోంది. ఈ కంపెనీ పెద్దగా లాభాల్లో లేక పోయినా ఆర్డర్లు పెద్ద ఎత్తున వచ్చి పడటంతో పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. దీంతో ఐదు నెలల్లోనే ఈ కంపెనీ షేరు రూ.7 నుంచి రూ.22కు చేరింది. అంటే ఐదు నెలల కిందట రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, నేడు రూ.2 లక్షల లాభాలు వచ్చాయని చెప్పవచ్చు.
సుజ్లాన్ ఎనర్జీ కంపెనీకీ భారీ ఆర్డర్లు దక్కాయి. ఆగష్టు 25 నాటికి కంపెనీకి 201 మెగావాట్ల సామర్థ్యంతో రూ. 1600 కోట్ల విలువైన పవన విద్యుత్తు ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు పనులు 2025లో ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది.గడచిన ఆరు మాసాల్లోనే సుజ్లాన్ కంపెనీ షేరు ఏకంగా 178 శాతం ఎగబాకింది. గత వారం ట్రేడింగ్లో ప్రతి రోజూ 13 శాతం పెరిగి 52 వారాల గరిష్ఠాలను తాకింది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.22.85 ట్రేడవుతోంది. గడచిన 30 రోజుల్లో ఈ షేరు 26 శాతం రాబడినిచ్చింది. ఏడాది కాలంలో 205 శాతం లాభాలు పంచింది. ప్రస్తుతం సుజ్లాన్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.30,410 కోట్లుగా ఉంది.
సుజ్లాన్ ఎనర్జీ దేశంలోని అతిపెద్ద విండ్ పవర్ కంపెనీల్లో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విండ్ పవర్ కంపనీ సుజ్లాన్. ఈ కంపెనీకి ఆసియా, ఆస్ట్రేలియా, యూరోప్, ఆఫ్రికా ఖండాల్లోని 17 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలున్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు