దిల్లీ
మెట్రోస్టేషన్లోఖలిస్థానీ అనుకూల రాతలు కలకలం రేపాయి. గ్రీన్ కారిడార్ పరిధిలోని ఐదు మెట్రోస్టేషన్ల గోడలపై
ఖలిస్థాన్ మద్దతుదారలు పలు నినాదాలు రాశారు. ఖలిస్థాన్ రెపరెండమ్ జిందాబాద్,
దిల్లీ బనేగా ఖలిస్థాన్ అంటూ గోడలపై రాశారు. సిఖ్ ఫర్ జిస్టిస్(SFI) పేరుతో ఈ రాతలు ఉన్నాయి.
శివాజీ
పార్క్, మాదిపూర్, పసిమ్ విహార్,పంజాబ్
బగ్, నాన్గోలై స్టేషన్లపై ఈ రాతలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక
బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సెప్టెంబర్
9,10 తేదీల్లో జీ-20 సమావేశం జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారుల చేష్టలు కలకలం
రేపుతున్నాయి. గతంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలో నివసిస్తున్న ఖలిస్థానీ
మద్దతుదారులు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు