దేశవ్యాప్తంగా
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 కు సంబంధించిన
ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISC) విడుదల చేసింది.
సవరించిన
కొత్త షెడ్యూల్ ప్రకారం, పరీక్ష రిజిస్ట్రేషన్లు ఆగస్టు 30న ప్రారంభమై సెప్టెంబర్
29న ముగుస్తాయి. అపరాధ రుసుం చెల్లించి ధరఖాస్తు చేసుకునే అవకాశం
అక్టోబర్ 13 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 3,4,10,11 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.
జాతీయస్థాయిలో
నిర్వహించే ఈ పరీక్ష స్కోరును కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం
కొలమానంగా తీసుకుంటారు. స్కోర్ ఆధారంగా ఐఐటీలతో పాటు ఐఐఎస్సీ బెంగళూరు, వివిధ
ఎన్ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ,
ఆర్కిటెక్చర్ విభాగాల్లో ప్రవేశం కల్పిస్తారు.
ఈ పరీక్షలో చూపిన ప్రతిభ పీహెచ్డీ ప్రవేశాలకు
ఉపయోగపడుతుంది. పీహెచ్డీ విద్యార్థులకు నెలకు 28,000 ఉపకారవేతనం కూడా లభిస్తుంది.
పీజీ విద్యార్థులకు 12 వేల రూపాయల సాయం అందజేస్తారు. gate2024.iisc.ac.in. లో పూర్తి వివరాలు అందుబాటులో
ఉంచింది. ఈ వెబ్సైట్ నుంచే దరఖాస్తులు ఆన్లైన్లో నింపాల్సి ఉంటుంది.