పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా, దత్తాప్రకార్‌లో అనధికారికంగా నిర్వహిస్తోన్న ఓ టపాసుల ఫ్యాక్టరీలో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి టపాసులు తయారు చేస్తోన్న కర్మాగారం కుప్పకూలిపోయింది. పేలుడు శబ్దాలు మూడు కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదం ఆదివారం ఉదయం 10 గంటలకు చోటు చేసుకుందని తెలుస్తోంది. నిల్‌గంజ్ మోష్‌పోల్ ఫ్యాక్టరీలో కార్మికులంతా పనిలో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘోర ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు