చంద్రుడితో
పాటు అంగారకుడు, శుక్రుడుపైకి వెళ్లే సామర్థ్యం భారత్ కు ఉందని ఇస్రో చీఫ్ సోమనాథ్
అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను ఇస్రో అమలు చేయగలుగుతోందని చెప్పిన
సోమనాథ్.. అంతరిక్షంలో మరింత విస్తరించి దేశాన్ని ప్రగతి పథంలో నిలపడమే ఇస్రో
లక్ష్యమన్నారు.
అంగారకుడితో
సహా శుక్రుడిపై పరిశోధనలు చేపట్టే సామర్థ్యం ఉందని అందుకు మరింత విశ్వాసం
అవసరమన్నారు. ఇతర గ్రహాలపై పరిశోధనలకుగాను మరిన్ని పెట్టుబడులు కావాలన్నారు. చంద్రుడికి సంబంధించి రోవర్ పంపే మరిన్ని
చిత్రాల కోసం ఇస్రో ఎదురుచూస్తోందని, ప్రస్తుతం ఈ పరిశోధనలపైనే ఎక్కువ దృష్టి
పెడుతున్నామన్నారు.
చంద్రయాన్-3
నుంచి భారీ విషయాన్ని ఆశిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ తెలిపారు. ఈ
చారిత్రాత్మక మిషన్ లో భాగమైనందుకు తనతోపాటు సహోద్యోగులందరూ గర్విస్తున్నారని
చెప్పారు. సూర్యుడిపై పరిశోధనకు గాను ఆదిత్య ఎల్ -1 మిషన్ ను సెప్టెంబర్ 2న
ప్రారంభించనున్నట్లు తెలిపారు.