కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, శ్రీలంక నుంచి బంగారం అక్రమంగా విజయవాడకు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తోన్న ముఠాను కస్టమ్స్ అధికారుల ప్రత్యేక బృందాలు, నిఘావేసి అదుపులోకి తీసుకున్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి విజయవాడ తరలిస్తుండగా బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద కస్టమ్స్ అధికారులు జరిపిన సోదాల్లో 4.3 కేజీల బంగారం, 6.8 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు పట్టుబడింది. పట్టుబడ్డ బంగారం విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తోన్న ముఠాపై కేసు నమోదు చేసి, విశాఖలోని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. గడచిన రెండేళ్లలోనే విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో రూ.42 కోట్ల విలువైన 70 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు