రాష్ట్రవ్యాప్తంగా
పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు
వర్షాలు అనేక చోట్ల పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన
వానలు కూడా ఒకటి రెండుచోట్ల పడే అవకాశముందని అంచనా వేసారు.
దాదాపు
మూడు వారాల నుంచి స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవానాలో కదలిక వచ్చింది. ఈ పరిణామం
కోస్తాంధ్రపై మోస్తరుగా ప్రభావం చూపుతోంది. మరోవైపు రాష్ట్రంపై నైరుతి, పశ్చిమ
గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు
కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇవాళ,
రేపు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా
తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని
వాతావరణ శాఖ వెల్లడించింది.
చిత్తూరు
జిల్లా రామాపురంలో శనివారం నాడు 3.1 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, అనంతపురం జిల్లా
చిటికలపల్లె లో2.7 సెం.మీ వర్షపాతం రికార్డైంది.