మదురై రైలు ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల నగదు సాయం అందిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించిన యూపీ సీఎం యోగి, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, వారిని స్వస్థలాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు టోల్ ఫ్రీ నంబర్ 1070 ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి సహకారం అవసరమైన వారు ఆ నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.
మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందజేస్తామని ఇప్పటికే దక్షిణ రైల్వే ప్రకటించింది.
దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. విషాద ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పరిస్థితిపై మదురై కలెక్టర్ సంగీతతో మాట్లాడారు. క్షతగాత్రులను చెన్నై రాజాజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని సూచించారు. అంతిమ సంస్కారాల కోసం మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రమాదానికి గురైన ప్రైవేటు పార్టీ కోచ్, ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్ లోని లక్నో నుంచి ప్రయాణమయ్యారు. శుక్రవారం నాగర్ కోయిల్ జంక్షన్ వద్ద దీనిని పునలూరు-మదురై రైలుకు కలిపారు. అనంతరం స్టాబ్లింగ్ లైన్ లో ఉంచారు. ఇవాళ తెల్లవారుజామున 5.15 గంటలకు రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్ ను వెలిగించి వంట చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే బోగీ అంతటా వ్యాపించాయి. 10 మంది మరణించగా, 50 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు