ఉప్పుడు
బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం సుంకం విధించింది. ధరలను అదుపులో
ఉంచేందుకు నిల్వలను సరిపడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు
25 నుంచి 20 శాతం సుంకం అమల్లోకి వచ్చినట్లు తెలిపిన కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ అక్టోబర్
16 వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడిచింది.
ఇప్పటికే
కస్టమ్స్ పోర్టుల్లో లోడ్ చేసి ఉంచిన పారా బాయిల్డ్ రైస్ కు సుంకం వర్తించదని
వెల్లడించింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉన్న ఎగుమతులకూ సుంకం నుంచి మినహాయింపు
ఉంటుందని వివరించింది.
ఇటీవల
బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. పాక్షికంగా మరపట్టిన,
పూర్తిగా మరపట్టిన పాలిష్ చేయని తెల్లబియ్యం ఎగుమతులకు ఈ నిషేధం వర్తిస్తుంది.
దీంతో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. ఎగుమతులు అదుపులో
ఉంచేందుకు ఈ సుంకం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ధరల
పెరుగుదల నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని కేంద్రం ఇటీవల విధించింది.
మరోవైపు అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని
సమాచారం.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు