దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన
నుంచి భారత్ చేరుకున్న ప్రధాని నేరుగా బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్ళారు. చంద్రయాన్-3
విజయంపై శాస్త్రవేత్తలను అభినందించారు. అక్కణ్ణుంచి నేరుగా దిల్లీ వెళ్ళిపోయారు.
అయితే మోదీ పర్యటనలో ఎక్కడా కర్ణాటక ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి కనబడలేదు.
స్వయంగా మోదీయే రావద్దని చెప్పడంతో వారు రాలేదు.
అయితే మోదీ అలా ఎందుకు చేసారు? తనను
స్వాగతించడానికి వారిని విమానాశ్రయానికి ఎందుకు రానీయలేదు? ఆ విషయంపై కాంగ్రెస్
నాయకులు విచిత్రమైన వ్యాఖ్యానం చేసారు. గురువారమే కర్ణాటక సీఎం, ఉపముఖ్యమంత్రి
గురువారమే ఇస్రో కేంద్రాన్ని సందర్శించారు, శాస్త్రవేత్తలను స్వయంగా అభినందించారు.
దాంతో మోదీకి చిర్రెత్తింది. అందుకే ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ముఖ్యమంత్రినీ,
ఉపముఖ్యమంత్రినీ ఎయిర్‌పోర్ట్‌కు రానీయకుండా ఆపేసారు… అని కాంగ్రెస్ నాయకులు
విమర్శిస్తున్నారు.
సీనియర్ నేత జైరాం రమేష్ ఇంకో అడుగు
ముందుకేసారు. ‘‘ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం హాస్యాస్పదం. మోదీ చంద్రయాన్-1
సమయంలో ఏం చేసారో గుర్తు చేసుకోవాలి. ఆ ఆపరేషన్ విజయం తర్వాత, నాటి ప్రధాని
మన్మోహన్ సింగ్ కంటె ముందు, గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు వెళ్ళారు. ఆ
విషయాన్ని మోదీ ఇప్పుడు మరచిపోయారా?’’ అని మండిపడ్డారు.
తనకంటె ముందు ఇస్రో శాస్త్రవేత్తలకు
అభినందనలు చెప్పినందుకు మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటక సీఎం, డీసీఎంలపై
కోపంతోనే వారిని విమానాశ్రయానికి రావొద్దన్నారంటూ మాంచి కథ అల్లేసారు. కానీ అసలు
సంగతి ఏంటి? ఆ విషయాన్ని స్వయంగా మోదీయే వివరించారు. బెంగళూరు హాల్ ఎయిర్పోర్ట్
బైట ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. ‘‘గ్రీస్ నుంచి నేను నేరుగా
బెంగళూరు వచ్చేసాను. ఇక్కడికి నేను ఎన్నింటికి చేరుకుంటానో కచ్చితంగా తెలియదు.
అలాంటప్పుడు ప్రోటోకాల్ పేరిట గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వంటి వారిని
ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే నన్ను ఆహ్వానించడం కోసం వారిని రావద్దని
చెప్పాను’’ అని మోదీ స్పష్టం చేసారు.
వడ్లగింజలో బియ్యపుగింజలాంటి చిన్న
విషయాన్ని పట్టుకుని దాన్ని కూడా రాద్ధాంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు చేసిన
ప్రయత్నం, స్వయంగా ప్రధానమంత్రే వివరణ ఇవ్వడంతో, ఎదురుతన్నింది.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం