చంద్రయన్ -3 విజయసంబరాలు ఇంకా ముగియకముందే ఇస్రో మరో శుభవార్త
చెప్పింది. వరుస చంద్రయాన్ ప్రయోగాలతో చంద్రుడి పై పరిశోధనలు చేస్తున్నట్లే
సౌరమండలం గుట్టు విప్పేందుకు సన్నదత ప్రకటించింది.
సౌరమండలంలో పరిశోధనకు గాను
ఆదిత్య ఎల్-1 ప్రయోగ తేదీని ఖరారు చేసింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్
సెంటర్ నుంచి సెప్టెంబ్ 2న ఆదిత్య లాంచింగ్ ప్రక్రియ ఉండే అవకాశముందని అహ్మదాబాద్
లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశముఖ్ తెలిపారు.
చంద్రయాన్ -3 ప్రాజెక్టులో పాల్గొన్న సాంకేతిక సిబ్బందిని ప్రధాని
మోదీ నేరుగా కలిసి అభినందనలు తెలిపడం తమలో మరింతప్రేరణ
నింపిందని, లక్ష్యం పట్ల మరింత పునరంకితం అయ్యేలా ప్రధాని ప్రసంగం స్ఫూర్తిగా
నిలిచిందని చెప్పారు. మిగిలి ఉన్న ప్రాజెక్టులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు
శాస్త్రవేత్తల్లో ఉత్తేజం నింపారని అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.
సూర్యుడి ఆవిర్భావం, అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు ఆదిత్య
ఎల్-1 ప్రయోగం ఉపకరిస్తుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్
పాయింట్ -1 వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. సుమారు
127 రోజుల ప్రయాణం తర్వాత కక్ష్యలోకి చేరుతుంది. తాజా ప్రయోగం విజయవంతమైతే సౌర
తుఫానులు, అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.