తిరుమల
పవిత్రతపై సీఎం జగన్కు నమ్మకం లేదనే విషయం మరోసారి నిరూపితమైందని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షురాలు పురందరేశ్వరి విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ
పునరావాస కేంద్రంగా మార్చారని దుయ్యబట్టిన బీజేపీ ఏపీ చీఫ్, టీటీడీ పాలకమండలిలో
పలు కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న వారికి చోటు కల్పించడాన్ని తప్పుబట్టారు.
రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ ఖండిస్తుందన్నారు. టీటీడీ
పాలకమండలి సభ్యుల జాబితాను తన ఖాతా నుంచి షేర్ చేశారు.
పాలకమండలి
సభ్యులుగా శరత చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్ నియామకమే ఇందుకు నిదర్శనమని తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ లిక్కర్ కుంభకోణంలో
పాత్రధారిగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని ఎలా నియమించారని ప్రశ్నించారు. అలాగే
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి దిల్లీ హైకోర్టు ఆదేశాలతో తొలగించబడిన కేతన్
దేశాయ్ ఎలా చోటు కల్పించారని ప్రశ్నించారు.