హర్యానాలోని నూహ్ జిల్లాలో నేటి నుంచి
రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆగస్ట్ 28న బ్రిజ్మండల్
జలాభిషేక్ యాత్రజరిపి తీరతామని విశ్వహిందూపరిషత్ ప్రకటించిన నేపథ్యంలో హర్యానా
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 28 అర్ధరాత్రి
వరకూ నూహ్ జిల్లాలో ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు. అలాగే బల్క్ ఎస్ఎంఎస్లు కూడా
నిషేధించారు.
హర్యానాలో విశ్వహిందూ పరిషత్ గత
మూడేళ్ళుగాబ్రిజ్మండల్ జలాభిషేక్ యాత్రను వార్షికోత్సవంగా నిర్వహిస్తోంది. అదే
క్రమంలో గత నెలలో చేపట్టిన యాత్రపై దాడులు జరిగాయి. మరో మతానికి చెందిన వారు,
భక్తుల యాత్రపై రాళ్ళు, తుపాకులతో దాడులు చేయడంతో భక్తులు బెదిరిపోయారు. దానివల్ల
యాత్ర జులై 31న అర్ధాంతరంగా నిలిచిపోయింది.
జులై 31 నాటి యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది
కాబట్టి ఆగస్టు 28న మరొకసారి జలాభిషేక యాత్ర నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్
నాయకులు ఆగస్టు 13నే వెల్లడించారు. అందుకే హర్యానా పోలీసులు ఈ రెండురోజులూ
ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తున్నారు.
విహెచ్పి యాత్రకు హర్యానా ప్రభుత్వం
అనుమతులు మంజూరు చేయలేదు. స్థానిక శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తుందని వారి
అంచనా. జులై 31 సమయంలో రెండు వర్గాల మధ్యా భేదాభిప్రాయాల నెపంతో యాత్ర
నిలిపివేసారు. దాంతో, విశ్వహిందూ పరిషత్ తమ యాత్రను 28న జరపాలనే పట్టుదలతో ఉంది.
నూహ్ డిప్యూటీ కమిషనర్ శుక్రవారం రాష్ట్ర
హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసారు. ఆ లేఖలో, జిల్లాలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయాలని
సిఫారసు చేసారు. దానికి స్పందనగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఈ ఉత్తర్వులు జారీ
చేసారు.