తమిళనాడు మదురై రైల్వేస్టేషన్ చేరువలో
నిలిచి ఉన్న ఒక రైలులో గ్యాస్ సిలెండర్ పేలింది. ఈ తెల్లవారుజామున జరిగిన
ప్రమాదంలో 9మంది చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారని రైల్వే అధికారులు
తెలియజేసారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది.
పునలూరు నుంచి మదురై వెడుతున్న ఎక్స్‌ప్రెస్
ఈ తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో చేరుకుంది. ఆ రైలుకు నాగర్‌కోయిల్ వద్ద
ఒక ప్రైవేటు పార్టీ కోచ్ జోడించారు. మదురై వద్ద ఆ కోచ్‌ను విడదీసి, స్టేబులింగ్
లైన్లో పెట్టారు. ఈ తెల్లవారుజామున 5.15 నిమిషాలకు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
మంటలు రాజుకోడానికి కారణం అక్రమంగా స్మగుల్ చేసిన సిలెండరే అని తెలుస్తోంది.
‘‘ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొంతమంది
వ్యక్తులు తమిళనాడులో పర్యటిస్తున్నారు. వాళ్ళు రైల్లో కాఫీ కలుపుకోడానికి గ్యాస్
స్టౌ వెలిగించారు. వారు వాడుతున్న సిలెండర్ పేలిపోయింది. మొత్తం 55మందిని రక్షించాం.
9 శవాలు వెలికితీసాం’’ అని మదురై జిల్లా కలెక్టర్ సంగీత చెప్పారు.
‘‘మదురై యార్డ్ దగ్గరలో ఉన్న రైల్లో, ఒక
ప్రైవేట్ పార్టీ బుక్ చేసుకున్న బోగీలో అగ్నిప్రమాదం తెల్లవారుజామున 5.15 గంటలకు
జరిగింది. ఆ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి 5.45 గంటలకు
చేరుకున్నారు. మంటలను పూర్తిగా ఆర్పేసరికి 7.15 గంటలయింది’’ అని దక్షిణ రైల్వే అధికారికంగా
ప్రకటించింది. రైల్లో మరే ఇతర బోగీకీ మంటలు వ్యాపించలేదు.
‘‘ప్రైవేటు పార్టీలోని ప్రయాణికులు రైలులోకి
గ్యాస్ సిలెండర్ అక్రమంగా తీసుకొచ్చారు. ఆ సిలెండరే ప్రమాదానికి కారణమైంది. మంటలు
రావడం చూసిన కొందరు ప్రయాణికులు బోగీ దిగిపోయారు’’ అని రైల్వే ప్రకటన స్పష్టం
చేసింది.
ఆ ప్రైవేటు పార్టీ, బోగీని
కొల్లమ్-చెన్నై ఎగ్మూర్ అనంతపురి ఎక్స్ ప్రెస్‌కు జోడించి, రేపటికి చెన్నై
చేరాల్సి ఉంది. అక్కణ్ణుంచి నేరుగా లక్నో
వెళ్ళాలన్నది వారి ప్రణాళిక. అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు