చంద్రయాన్-3
తో భారత్ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని
ప్రధాని మోదీ కొనియాడారు. దేశఖ్యాతిని దిగంతాలకు చాటిన శాస్త్రవేత్తలను నేరుగా
కలిసి అభినందనలు తెలపకుండా ఉండలేకనే విదేశీ పర్యటన నుంచి బెంగళూరు చేరుకున్నట్లు తెలిపారు.
ఇస్రో
సిబ్బంది, శాస్త్ర, సాంకేతిక నిపుణులతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ తీవ్ర
భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్ -3 విజయవంతమైన ఆగస్టు 23ను స్పేస్ డే గా
నిర్వహించుకుందామని పిలుపునిచారు. రాబోయే
తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు.
విమానాశ్రయం
వద్దకు వచ్చిన అభిమానులకు మోదీ అభివాదం చేశారు. అక్కడి నుంచి ఇస్రో కేంద్రానికి
వెళ్లి శాస్త్రవేత్తలతో ముచ్చటించి అభినందనలు తెలిపారు. చంద్రయాన్ -3 ప్రయోగంలోని
వివిధ దశలను ప్రధానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు.
చంద్రయాన్
-3 అడుగుమోపిన స్థలానికి శివశక్తి పాయింట్ గా పేరుపెట్టిన మోదీ, చంద్రయాన్ -2
దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్ గా పిలవాలని కోరారు. ఇస్రో సాధించిన అరుదైన ఘనతతో భారత శక్తి, సామర్థ్యాలను
ప్రపంచం కీర్తిస్తోందని ఉద్ఘాటించారు. ప్రసంగంలో భాగంగా జై విజ్ఞాన్, జై అనుసంధాన్
అంటూ మోదీ నినదించారు.
చంద్రయాన్
-3 ప్రయోగంలో మహిళా సైంటిస్టుల పాత్రను ప్రస్తావించిన ప్రధాని మోదీ, శివశక్తి అనే
పదం కష్టానికి గుర్తు అని, మహిళా సాధికారతకు నిదర్శనమని వివరించారు. మన నారీశక్తి ఏమిటో
మరోసారి ప్రపంచానికి చూపామన్నారు.
ప్రసంగం
చివరిలో ప్రధాని మోదీ, భారత్ మాతాకీ జై అని నినదించగా, శాస్త్రవేత్తలు కూడా గొంతు
కలిపారు.