భారత్- గ్రీస్లు సహజభాగస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ఇరు
దేశాల మధ్య అత్యంత పురాతనమైన, దృఢమైన
బంధం ఉందన్నారు.
గ్రీస్
ప్రధాని ఆహ్వానం మేరకు ఇవాళ ఆ దేశంలో పర్యటించిన నరేంద్ర మోదీ.. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికత కల్గిన
భారత్, గ్రీస్ లు సంస్కృతి, భావజాలం, వాణిజ్యంలో కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నాయని
పేర్కొన్నారు.
గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ తో కలిసి
మీడియా సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోదీ, పురాతన నాగరికత కల్గిన ఇరు దేశాల మధ్య
సంబంధాలు అత్యంత పటిష్టమైనవని గుర్తు చేశారు. 1983లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ
తర్వాత, ఇప్పటి వరకు గ్రీస్ లో భారత ప్రధాని పర్యటించలేదని, 40 ఏళ్ళ సుదీర్ఘ
విరామం ఏర్పడినప్పటికీ ఇరు దేశాల మధ్య ప్రేమాభిమానాలు, సంబంధబాంధావ్యాలు తగ్గలేదని
కొనియాడారు. ఇండియా-గ్రీస్ సంబంధాలు వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్తామని మోదీ
చెప్పారు. రక్షణ, భద్రత, నిర్మాణరంగం, వ్యవసాయం, విద్య, కొత్త సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి విషయాల్లో ఇరు
దేశాల మధ్య సహాయసహకారాలు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు.
గ్రీస్ పర్యటనలో భాగంగా తొలుత సైనిక
స్మారకస్థూపం వద్ద నివాళులర్పించిన మోదీ, ఆ దేశ సైన్యం నుంచి గౌరవ వందనం
స్వీకరించారు. ఏథెన్స్ పర్యటనలో తనకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులతో
ముచ్చటించారు.
గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా
సకెల్లారోపౌలోవుతోనూ మర్యాదపూర్వకంగా సమావేశమైన ప్రధాని మోదీ, ఇరుదేశాల మధ్య సుహృద్భావ
వాతావరణంపై మాట్లాడారు. చంద్రయాన్ -3 విజయం సాధించడంపై కాటెరినా అభినందనలు తెలిపారు.
. గ్రీస్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ను మోదీకి ప్రదానం చేశారు.
అత్యధిక జనాభా కల్గిన ప్రజాస్వామ్య
దేశానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య
దేశం ఆతిథ్యం ఇచ్చిందని గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ అన్నారు. చంద్రయాన్-3
విజయంతో భారత్ అత్యంత అరుదైన ఘనత సాధించిందని ప్రశంసించారు. భారత్ పర్యటనకు రావాలని గ్రీస్ ప్రధానిని మోదీ ఆహ్వానించగా ఆయన అంగీకరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు