సెప్టెంబర్ నెలలో భారతదేశంలో జరగబోయే జి-20
సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు అవడం లేదు. క్రెమ్లిన్
అధికార ప్రతినిధి ద్మీత్రీ పెస్కోవ్ ఆ విషయాన్ని ఇవాళ ధ్రువీకరించారు.
ప్రస్తుతం రష్యా దృష్టి అంతా ప్రత్యేక సైనిక
చర్య మీదనే ఉందని పెస్కోవ్ చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడిని రష్యా స్పెషల్ మిలటరీ
ఆపరేషన్ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన బ్రిక్స్ సమావేశాలకు సైతం
పుతిన్ హాజరు కాలేదు, వీడియో లింక్ ద్వారా వర్చువల్‌గా మాట్లాడారు.
అగ్రరాజ్యాలు, వర్ధమాన దేశాల సమాహారమైన జి-20
సమావేశాలు సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో భారత్‌లో జరగబోతున్నాయి. ఆ సమావేశాలకు
ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు, అతిథులు ఎందరో హాజరవుతున్నారు.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి
పాల్పడిన నేరానికి, ఈ యేడాది మార్చ్‌లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, పుతిన్
అరెస్టుకు వారంట్ జారీ చేసింది. యుద్ధనేరాలకు పాల్పడ్డారంటూ పుతిన్ మీద అభియోగాలు
మోపింది. ఆ ఆరోపణలను రష్యా తిప్పికొట్టింది. ఆ నేపథ్యంలో పుతిన్ రష్యా బైట ఎలాంటి
కార్యక్రమాలకూ వ్యక్తిగతంగా హాజరవడం లేదు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు